అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే పది రోజుల తేడాతో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 9వ తేదీతో పూర్తవుతుంది. మార్కులను ఆన్లైన్లోకి ఎక్కించి ఈ నెల 15వ తేదీ తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్ ను ప్రాసెస్ చేసి ఈ నెల 25వ తేదీ తర్వాత విడుదల చేయాలని అధికారులు బావిస్తున్నారు.
Tags: Do you know when the 10th and Intermediate results will be released in AP?