అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో గ్యాస్ సిలిండర్ల పంపిణీ వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు, డెలివరీల మధ్యనున్న వ్యత్యాసం క్రమంగా తొలగుతోందని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శని, ఆదివారాల్లో బుకింగ్ల కంటే డెలివరీలు అధికంగా జరిగాయని పేర్కొంది. శనివారం 2,11,302 గ్యాస్ బుకింగ్స్ జరిగితే.. 2,77,367 డెలివరీలు అయ్యాయి ఆదివారం 2,92,247 గ్యాస్ డెలివరీలు జరిగాయి.
Tags: Gas Cylinder Deliveries Expedited in Andhra Pradesh