అమరావతిముచ్చట్లు:
భూమి నుంచి తీసే ముడి చమురును రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాతే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభిస్తాయి. ఒక లీటరు ముడి చమురును శుద్ధి చేస్తే దాదాపు 450-500 మిల్లీలీటర్ల పెట్రోల్ వస్తుంది. మిగిలిన దానిలో డీజిల్, విమాన ఇంధనం, వంట గ్యాస్ వంటివి తయారు చేస్తారు. ఒక బ్యారెల్ (159 లీటర్లు) ముడి చమురు నుంచి సుమారు 73 లీటర్ల పెట్రోల్ వస్తుంది. ముడి చమురు నాణ్యతను బట్టి పెట్రోల్ ఉత్పత్తి మారుతుంది. పెట్రోల్, డీజిల్తో పాటు తారు, ప్లాస్టిక్, మందుల తయారీ లోనూ ముడి చమురును ఉపయోగిస్తారు.
Tags: Do you know how much petrol is obtained from crude oil?