April 6, 2026
Explore
చంద్రగిరిలో రైలు పట్టాలపై సుండుపల్లి యువకుడి మృతదేహం

చంద్రగిరిలో రైలు పట్టాలపై సుండుపల్లి యువకుడి మృతదేహం

April 6, 2026 | Andhra Pradesh

చంద్రగిరి ముచ్చట్లు:

చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైలు పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంకు చెందిన షేక్ అస్లాం (20)గా గుర్తించారు.

ఈ ఘటనపై చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Body of Youth from Sundupalli Found on Railway Tracks in Chandragiri