July 28, 2026
Explore
పెనగలూరులో 6.5 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

పెనగలూరులో 6.5 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

July 28, 2026 | Andhra Pradesh

పెనగలూరు ముచ్చట్లు:

పెనగలూరు మండలం బెస్తపల్లి గ్రామ సమీపంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్‌ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల వద్ద నుంచి ఒక టాటా సుమో, మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

Tags: 6.5 kg of Ganja Seized in Penagaluru; Three Arrested