July 28, 2026
Explore
రాయచోటి సమీపంలో టమోటా లారీ బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

రాయచోటి సమీపంలో టమోటా లారీ బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

July 28, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటికి సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జాతీయ రహదారి-40పై సోమవారం టమోటా లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చిత్తూరు నుంచి కడప మీదుగా రాజస్థాన్‌కు వెళ్తున్న RJ11 GC 4308 నంబర్ గల లారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

లారీ జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీలో ఉన్న టమోటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టారు. రహదారిపై లారీని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.

Tags: Tomato-laden lorry overturns near Rayachoti; traffic disrupted.