రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి: స్థానిక మాసాపేటలో నివాసముంటున్న ఆర్టీసీ ఉద్యోగిని జి. రోషిణి (24) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో అనౌన్సర్‌గా పనిచేస్తున్న ఆమె, శనివారం అర్ధరాత్రి తన నివాసంలో విష ద్రావణం తాగారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, భర్త నియాజ్ ప్రైవేట్ కళాశాలలో చిరు ఉద్యోగి గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: RTC employee commits suicide