April 6, 2026
Explore
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

April 6, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.

ముఖ్యంగా ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యం, సెక్యూరిటీ సిబ్బంది అక్రమ వసూళ్లపై వస్తున్న ఫిర్యాదులపై ఆయన మండిపడ్డారు. రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం డయాలసిస్ కేంద్రం రద్దీని గమనించి, త్వరలోనే డయాలసిస్ కోసం మరొక ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.

Tags: MLA Conducts Surprise Inspection at Madanapalle District Hospital