మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె: ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు. నడవలేని స్థితిలో వచ్చిన వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా కలికిరి మండలానికి చెందిన మల్లమ్మ, మదనపల్లెకు చెందిన గౌస్ సాహెబ్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సంబంధిత సీఐలకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్ నేరాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు చట్టపరిధిలో సత్వర న్యాయం చేకూర్చాలని అధికారులకు సూచించారు. బాధితుల పక్షాన నిలబడి అండగా ఉండటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Tags: District SP Visits Victims to Receive Petitions