April 6, 2026
Explore
బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి దారుణ హత్య

బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి దారుణ హత్య

April 6, 2026 | Andhra Pradesh

చౌడేపల్లి ముచ్చట్లు:

బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

తండ్రిని చంపేస్తుంటే కళ్లారా చూసిన ఐదేళ్ల కుమారుడు సందీప్, రాత్రంతా తండ్రి శవం పక్కనే అడవిలో గడిపాడు. ఉదయం 1.5 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి సమీపంలోని అంగన్‌వాడీ టీచర్‌కు విషయం చెప్పాడు. టీచర్ అడవిలోకి వెళ్లి చూడగా గాంధీ శవమై పడి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

అక్రమ సంబంధం కారణంగానే నరసింహులు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి గాంధీని హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడి భార్య రాఫాతి ప్రస్తుతం పరారీలో ఉంది. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐదేళ్ల బాలుడి ధైర్యం, పడ్డ వేదన స్థానికులను కన్నీరు పెట్టించింది.

Tags: Tamil Nadu Native Brutally Murdered in Boyakonda Forest Area