April 5, 2026
Explore
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.

April 5, 2026 | Andhra Pradesh

. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతిముచ్చట్లు:

ఏపీలోని ఆలయాల్లో అర్చకులు నిర్వహించే పూజలకు సంబంధించి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగమ శాస్త్ర నియమాలు, శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలు, రాష్ట్ర దేవాదాయ శాఖ గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న తుది ఉత్తర్వులు ఇచ్చారు.

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజి ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. 2010లో ధార్మిక పరిషత్ జారీ చేసిన సర్క్యులర్‌ను, శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు మహాతీర్థ భారతీస్వామి విడుదల చేసిన ప్రామాణికను ఆలయాల్లో సరిగ్గా అమలు చేయడం లేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనల

Tags; Priests who have traveled abroad must not perform rituals in the sanctum sanctorum.