పుంగనూరుముచ్చట్లు:
చౌకదుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు వెళ్తున్న మైనర్ బాలికను ఓ ఆటో డ్రైవర్ శనివారం తన ఆటోలో ఎక్కించుకుని అత్యాచారం చేసినట్లు బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన 35 సంవత్సరాల వయసు కలిగిన ఆటో డ్రైవర్ తన ఆటోలో తీసుకుని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికపై దాడి చేసి అత్యాచారం చేశాడని, తిరిగి ఆబాలికను ఆటోలో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలివెళ్ళాడని బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో వారు ఇంటికి రాగానే బాలిక విషయం తెలిపింది. ఈ మేరకు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Tags: Rape of a Minor Girl