తిరుపతి ముచ్చట్లు:
- ఎస్పీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరణ.
- సమాజ సేవకు ఆయన చేసిన కృషి స్మరణీయమని అధికారులు వ్యాఖ్యలు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్, సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ఎస్పీ కార్యాలయంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని మరియు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకట్రావు పాల్గొని, బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
- అనంతరం ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బాబు జగజీవన్ రావు సామాజిక సమానత్వం, న్యాయం కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
- ఆయన చూపిన మార్గంలోనే సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Heartfelt tributes on the occasion of Babu Jagjivan Rao’s birth anniversary.