April 5, 2026
Explore
విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం

విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం

April 5, 2026 | Andhra Pradesh

వేంపల్లి ముచ్చట్లు:

వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం…

కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం..

విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు..

బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ …

దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు..

ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు..

తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.

Tags: RTC Bus Catches Fire After Hitting High-Voltage Power Lines