పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బెంగళూరు రహదారి నుంచి అరవపల్లె గ్రామానికి వెళ్లే సిమెంటు లింకురోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామానికి లింకు రోడ్డు అవసరమని గ్రామస్తులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయన ఆదేశాలతో రూ.10 లక్షలతో రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 2న ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆంజప్ప, ఆంటోని, గ్రామస్తులు కలసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలో కాంట్రాక్టర్, పార్టీ నాయకులు దగ్గరుండి రోడ్డు పనులు చురుగ్గా చేపట్టారు. పనులు పూర్తికావస్తుండటంతో గ్రామస్తులు వైఎస్సార్‌సిపి నాయకులకు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:Aravapalle road works are progressing briskly.