April 5, 2026
Explore
ఏసుక్రీస్తు పునరుత్తాన పండుగ

ఏసుక్రీస్తు పునరుత్తాన పండుగ

April 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నాగపాళెంలో గల సీఎస్‌ఐ హట్టన్‌మెమోరియల్‌ చర్చిలో ఫాస్టర్‌ రాఖేష్‌నిమ్రోద్‌ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు పునరుత్తాన పండుగ నిర్వహించారు. ఆదివారం పట్టణ క్రైస్తవులు అందరు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్‌ పఠనం చేశారు. సమాధుల వద్దకు వెళ్లి పిత్రుదేవతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా చర్చిలో జరిగిన సమావేశంలో ఫాస్టర్‌ బైబిల్‌ బోదనలు చేపట్టారు. ఏసుక్రీస్తు శిలువపై మరణించిన మూడోదినం తిరిగి పునరుత్తానం చెంది , సజీవుడుగా ఏసుక్రీస్తు లేచారని బోదించారు. ప్రతి ఒక్కరు ఏసు సూచించిన మార్గంలో జీవించాలని, పేదలను ప్రేమించాలని కోరారు. క్రైస్తవులు ఫాస్టర్‌ పలుకులను భక్తితో స్వీకరించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్రదాన కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: The Festival of the Resurrection of Jesus Christ