పుంగనూరుముచ్చట్లు:
స్వాతంత్య్ర సమరయోధుడు , మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో మాజీ ఎంపి రెడ్డెప్ప అంబేద్కర్ విగ్రహానికి, జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.అలాగే ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్డెప్ప మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సామాజిక సమానత్వం కోసం , అనగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని సమరం సాగించిన విప్లవయోధుడు బాబు జగ్జివన్‌రామ్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నాగరాజ, శంకర్, ప్రభాకర్, వెంకట్రమణ, నారాయణ, అమర, బుడ్డన్న, శ్రీనివాసులు, మణి, ఆనంద, నరసింహులు, శివశంకర్, హరి తదితరులు పాల్గొన్నారు.

Tags: Jagjivan Ram Birth Anniversary Celebrations