రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై నిన్న చేసిన అసత్య వాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదంను జీర్ణించుకోలేక వైసీపీ కుట్రలు….
అమరావతి పై దుష్ప్రచారం, రాజకీయ కుట్ర, ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము.
టీడీపీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణఅధ్యక్షుడు బోనమల ఖాదర్ వల్లి
రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతిపై అసత్యాలు మాట్లాడటం దురదృష్టకరం.
అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలతో, నిపుణుల సూచనలతో నిర్ణయించిన రాజధాని. దీనిపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైంది కాదు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ అవి వాస్తవాల ఆధారంగా ఉండాలి. రాజకీయ లాభాల కోసం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యం పెట్టుకోవడం వారి ముర్ఖత్వానికి నిదర్శనం.
ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధమైన ప్రకటనలను సరైనవి కాదు అని ఖండిస్తున్నాము.
శ్రీకాంత్ రెడ్డి ని వైస్సార్సీపీ ని సూటిగా ప్రశ్నిస్తున్నాము….అమరావతి విషయంలో చంద్రబాబు బంధువులు లాభపడ్డారు అని ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణ చేస్తు… ప్రజల్లో అపోహలు కలిగించేందుకు మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు అని ప్రజలు గ్రహిస్తున్నారని మీరు తెలుసుకువాలి.
మీరు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అని అంటారు…కోర్టుల్లో నిలబడని ఆరోపణను మళ్లీ మళ్లీ చెప్పడం అబద్ధాన్ని నిజం చేయదు.
ఏ విచారణలోనూ ఇది నిరూపితం కాలేదు అని మీరు గ్రహించాలి.
శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతి ని వ్యతిరేకించాయి అని మీరు అసత్యం మాట్లాడుతున్నారు….
శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు పలు ఎంపికలు సూచించాయి, అమరావతి కూడా ఒక బలమైన ఎంపికగా పరిగణించబడింది.
అమరావతి అనుకూల ప్రాంతం కాదు అని మీరుమాట్లాడుతున్నారు…..
రాష్ట్ర మధ్యలో ఉన్న అమరావతి కంటే మెరుగైన లొకేషన్ ఏది చెప్పగలరు? అని నేను ప్రశ్నిస్తున్న…
అమరావతి భౌగోళికంగా అనుకూలం
ఈ ప్రాంతం రాష్ట్రం మధ్యలో ఉండటం వల్ల అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ సులభం. భూభాగం, రవాణా, నీటి వనరులు—all factors అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని తప్పుగా చూపించడం మీ వైస్సార్సీపీ అవివేకం అని ప్రజలు గమనిస్తున్నారు .
అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి భారంగా మారుతుంది అని మీరు ఆరోపణలు చేస్తున్నారు…
అభివృద్ధిని భారంగా చూపించడం వెనుకబాటు రాజకీయాల లక్షణం అని మీరు గ్రహించాలి.
Tags: Malicious Propaganda Against Amaravati