April 4, 2026
Explore
తిరుమల పవిత్రత కాపాడాలి – వైఎస్సార్‌సీపీ నేతలు

తిరుమల పవిత్రత కాపాడాలి – వైఎస్సార్‌సీపీ నేతలు

April 4, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు:

రామాపురం మండలం, హసనాపురం యర్రంగివాండ్లపల్లె తిరుమల పవిత్రతను కాపాడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు హసనాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుళ్లను రాజకీయాలకు లాగకూడదని సూచించారు. తిరుమల లడ్డూ అంశంపై ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా చేసిన పనులపై విమర్శలు చేస్తోందన్నారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయాల పవిత్రతపై రాజకీయాలు చేస్తే సహించమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags: The Sanctity of Tirumala Must Be Preserved – YSRCP Leaders