April 4, 2026
Explore
మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన కార్యక్రమాలు.

మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన కార్యక్రమాలు.

April 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • శక్తి యాప్, సైబర్ నేరాలు, అత్యవసర సేవలపై ప్రజలకు అవగాహన.
  • బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీం పోలీస్ వారు జిల్లాలోని పలు ప్రాంతాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
  • జిల్లా వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల పోలీసు వారు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్, వాణిజ్య సముదాయాలు వంటి ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రాంతాలలో మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
  • శక్తి టీం సిబ్బంది మహిళలకు Shakthi App వినియోగంపై వివరించి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసుల సహాయం పొందే విధానాన్ని తెలియజేశారు. అదేవిధంగా, సైబర్ క్రైమ్‌లు, మహిళలపై జరిగే నేరాలు, గృహ హింస, అనుమానాస్పద వీడియో కాల్స్, తెలియని లింకులు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ గురించి జాగ్రత్తలు సూచించారు.
  • మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం, అలాగే అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లు (112 వంటి సేవలు) గురించి ప్రజలకు వివరించారు.
  • ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Tags: Shakti Team conducts extensive awareness programs on women’s safety.