.. లోయలోకి దూసుకెళ్లిన లారీ.. డ్రైవర్ దుర్మరణం!
రామాపురంముచ్చట్లు:
రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకరమైన మలుపు వద్ద లారీ అదుపుతప్పి పైనుంచి కిందకు దూసుకెళ్లింది.
స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Tags:Horrific accident at Guvvalacheruvu Ghat