April 3, 2026
Explore
కర్ణాటక సరిహద్దు రాయల్ పాడు వద్ద రోడ్డు ప్రమాదం

కర్ణాటక సరిహద్దు రాయల్ పాడు వద్ద రోడ్డు ప్రమాదం

April 3, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన అక్కడికక్కడే మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడగా బాధితుల్ని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రాయల్పాడు ఎస్ఐ కథనం.. కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24), అతని స్నేహితుడు రాజారెడ్డివీధికి చెందిన ఉమామహేష్ (25) లు ఉద్యోగం కోసం బైకులో బెంగళూరు కి వెళుతుండగా, మార్గ మధ్యంలోని రాయలపాడు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పి పడి దీవన అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు ఉమమహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Tags: Road accident at Royal Padu, on the Karnataka border.