అమరావతిముచ్చట్లు:
రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజారాజధానికి చట్టబద్ధత వచ్చిందని చెప్పారు. ఈ ఆనంద సమయంలో నేటి సాయంత్రం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ‘మన రాజధాని అమరావ దీపహారతులు ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వెలిగించిన దీపంతో సెల్ఫీ తీసుకుని, ఆ ఫొటోను #APThanksIndia హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. చట్టబద్ధతకు సహకరించిన పార్టీలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
Tags: The eclipse has ended… Post your selfies with lamps: Lokesh