April 2, 2026
Explore
జెఈఈ, నీట్‌ పరీక్షల శిక్షణకు విద్యార్థులు ఎంపిక

జెఈఈ, నీట్‌ పరీక్షల శిక్షణకు విద్యార్థులు ఎంపిక

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఆదర్శపాఠశాల నుంచి జెఈఈ , నీట్‌ , ఈఏపిసెట్‌ చదివే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం 9 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మోడల్‌స్కూల్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శాంతిపురం మండలం తుమిసి ఆదర్శ పాఠశాలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. స్థానిక పాఠశాల నుంచి జవహర్‌నిసా, భాగ్యశ్రీ, దీపిక, విద్యాశ్రీ, భవ్యశ్రీ, మాధుర్య, సుకన్య, హేమశ్రీ, మోహిత లను ఎంపిక చేశామన్నారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న వీరికి జెఈఈ, నీట్‌, ఈఏపిసెట్‌ లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags: Students Selected for JEE and NEET Exam Coaching