16,061 వేల మంది నియామకం
- పెద్దిరెడ్డి నియోజకవర్గం ఆదర్శం
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి పిలుపు మేరకు గ్రామ , వార్డు కమిటిల నియామకంలో 16,061 వేల మందిని సభ్యులుగా ఎంపిక చేసి పుంగనూరు నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గమైన పుంగనూరులో తొలి సారిగా కమిటిల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే, ఎంపి పర్యవేక్షణలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్‌రెడ్డి, ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి లు కలసి నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఇతర ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలసి మూడుసార్లు సదుం మండలం ఎతివారిపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి తో పాటు రాజంపేట, చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు హాజరై గ్రామ కమిటి సభ్యుల గూర్చి వివరించారు. ఇలా సమావేశాలు నిర్వహించడంతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని కమిటి సభ్యులతో టెలికాన్ఫిరెన్స్లు నిర్వహించడంతో క్యాడర్‌లో నూతనోత్సం పెల్లుబికింది. పార్టీ క్యాడర్, కమిటిల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో కీలకపాత్ర వహించారు. క్యాడర్‌కు పూర్తి స్థాయి అవగాహన రావడంతో కమిటిల నియామకం సులభతరమైంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మరింత పటిష్టమై , భవిష్యత్తులో కమిటిల సభ్యులు కీలకం కానున్నారు. అలాగే నియోజకవర్గ నాయకులు ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్‌లో తలమునకలైయ్యారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోను లేని విధంగా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కోర్ కమిటి సభ్యులుగా 2,547 మంది, అఫిలియేటెడ్ వింగ్స్ సభ్యులుగా 13,514 మంది, వెహోత్తం 16,061 మందిని నియమించి , ఆదర్శంగా నిలిచి, పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

Tags: Punganur Ranks First in YSRCP Committees