April 2, 2026
Explore
రూ.10 లక్షలతో సిమెంటురోడ్డు పనులు ప్రారంభం

రూ.10 లక్షలతో సిమెంటురోడ్డు పనులు ప్రారంభం

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని బెంగళూరు రహదారి నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేసి సిమెంటు రోడ్డును అరవపల్లె గ్రామానికి వేసే పనులను గురువారం ప్రారంభించారు. ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆంజప్ప, ఆంటోని, గ్రామస్తులు కలసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి లింకు రోడ్డు అవసరమని గ్రామస్తులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయన స్పందించి జెడ్పి నిధులతో సిసిరోడ్డు తక్షణమే వేయాలని ఎంపిపిని ఆదేశించారు. ఈ మేరకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం లింకు రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్‌సిపి ప్రభుత్వందేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆనందరెడ్డి, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Cement road works launched at a cost of Rs 10 lakhs.