శ్రీ సత్యసాయి ముచ్చట్లు:
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్,
ధర్మవరం సబ్-డివిజన్ పరిధిలోని ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్, ముదిగుబ్బ యూపీఎస్, ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల సందర్భంగా ఎస్పీ ధర్మవరం, ముదిగుబ్బ, పుట్టపర్తి ప్రాంతాల్లో రాత్రి పహారా విధులు, సిబ్బంది మోహరింపు పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, వారి పనితీరు, అప్రమత్తత, రాత్రి భద్రతా నిబంధనల అమలు విధానాన్ని సమీక్షించారు.
రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది బీట్, గస్తీలు ,విధుల కేటాయింపు మరియు వాహన తనిఖీలు
ఎంఎస్‌సీడీ ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా అనుమానితుల పర్యవేక్షణ
దొంగతనాలు మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు తీసుకుంటున్న నివారణ చర్యలు
అన్ని ప్రాంతాలు, కాలనీల్లో రాత్రి వేళల్లో గస్తీలు మరింత ముమ్మరం చేయాలి
అనుమానాస్పద కదలికలపై కఠిన నిఘా ఉంచాలి
అర్ధరాత్రి సమయంలో అవసరం లేని ప్రజల సంచారాన్ని నియంత్రించాలి
డ్రోన్లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిఘాను బలోపేతం చేయాలి
సున్నిత ప్రాంతాల్లో బీట్ కానిస్టేబుళ్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి
నేర నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నివారణ, ప్రజా భద్రత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఇటువంటి ఆకస్మిక రాత్రి తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.
ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Tags: Midnight Surprise Inspections in Dharmavaram Sub-division…