తిరుపతి ముచ్చట్లు:
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారి తరఫున అర్చకులు శ్రీనివాస్, స్వామివారి తరఫున రాజేష్‌స్వామి పాల్గొన్నారు.
Tags: The Affectionate Darshan of the Lord and Goddess during the ‘Edurkolu’ Ceremony