ఒంటిమిట్ట ముచ్చట్లు:
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో నిర్వహిస్తున్న శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి సాయంత్రం ఒంటిమిట్ట హెలిపాడ్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న వారిని ఆప్యాయంగా పేరుపేరున పలకరించారు. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
Tags:Grand Welcome for Chief Minister Chandrababu Naidu at the Ontimitta Helipad