April 1, 2026
Explore
గ్రామీణ ప్రజలు ఆధ్యాత్మీకంవైపు-మాజీ మంత్రి పెద్దిరెడ్డి

గ్రామీణ ప్రజలు ఆధ్యాత్మీకంవైపు-మాజీ మంత్రి పెద్దిరెడ్డి

April 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గ్రామీణ ప్రాంత ప్రజలు ఆద్యాత్మీకం వైపు రావడం , భక్తిని పెంపొందించుకోవడం శుభపరిణామమని మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాసమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు నిర్మించిన ఆలయాన్ని పెద్దిరెడ్డి సందర్శించి గ్రామస్తులతో పలు విషయాలపై చర్చించారు. ప్రతి గ్రామంలోను రామాలయాలు, సాయిబాబా ఆలయాలు, ఆంజనేయస్వామి, గంగమ్మ ఆలయాలను నిర్మించడం ఎంతో శుభపరిణామమన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మీకం వైపు నడిస్తే ప్రశాంతత చేకూరి సంతోషంగా జీవించేందుకు వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా మాజీ చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రమణ, నంజుండప్ప, శంకరప్ప, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Rural People Turning Towards Spirituality — Former Minister Peddireddy