April 1, 2026
Explore
బి కొత్తకోట మండలంలో యువకుడు ఆత్మహత్య

బి కొత్తకోట మండలంలో యువకుడు ఆత్మహత్య

April 1, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. మొగసాల మర్రి కి చెందిన సుబ్బారెడ్డి కొడుకు శ్యామ్ రెడ్డి(23) ఇంజనీరింగ్ చదివి ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఏం జరిగిందో ఏమో.. తను ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి శ్యామ్ రెడ్డి దారిలోనే మృతి చెందాడని చెప్పడంతో చేతి కంది వచ్చిన బిడ్డ ఇక లేడని కన్నీరు మున్నీరుగా విలపించారు.

Tags; Young Man Commits Suicide in B. Kothakota Mandal