బి.కొత్తకోట ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని కొందరి రెవెన్యూ అధికారుల లీలలకు సామాన్య అమాయక రైతులు బలైపోతున్నారు. ఒకరి భూమిని మరొకరి పేరుతో వన్ బి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి, కొట్టుకు చచ్చేలా చేస్తున్నారు. అంతటితో ఆగిపోలేదు. ఒక్కసారి వన్ బి పాస్ పుస్తకాలు మంజూరు చేస్తే వాటిని తిరిగి తాను హక్కుదారుడిగా పొందాలంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తోంది. కాస్తో కోస్తూ అధికారుల సపోర్టు, రాజకీయ నాయకుల అండదండలు ఉంటే వారికి వ్యయ ప్రయాసల అనంతరం తిరిగి వారి భూమి వారికి దక్కుతుంది. దీనంతటికీ మూల కారణం వీఆర్వో లతో పాటు సర్వేయర్లు ప్రథమ భూమిక పోషిస్తున్నారు. రెవెన్యూ లీలలకు సామాన్య రైతులు బలైపోతున్నారు, అనడానికి నిలువెత్తు నిదర్శనం బి.కొత్తకోట రెవిన్యూ అధికారుల లీలలతో బలైపోతున్న రైతుల దీనగాద ఇది. బుధవారం అక్కడి రైతులందరూ మదనపల్లె ప్రెస్ క్లబ్ కు వచ్చి తమ గోడును విన్నవించారు. భూ రీ సర్వే పేరుతో రెవిన్యూ అధికారులు సంభంధం లేని రైతులకు, అసలు 1బీ, పాస్ పుస్తకాలు ఇచ్చి, గొడవలు మాకు మాకే పెడుతున్నారని ఆరోపించారు. అంతే కాదు సమాచారం ఇవ్వకుండానే తాము లేనప్పుడు తమ భూములను రీ సర్వే చేసి, లేనివారికి హక్కులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ స్పందించి తప్పిదాలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Tags: Revenue Department Shenanigans… Farmers Fall Victim