గద్వాల్ ముచ్చట్లు:
➤ – ప్రాణనష్టం కేసులో నిందితునికి 2 ఏళ్ల జైలు మరియు 2000 జరిమానా : జిల్లా ఎస్పీ
జోగుళాంబ గద్వాల జిల్లాలో 21-06-2018 మంత్రాలయం నుంచి తిరుగు ప్రయాణంలో, మధ్యాహ్నం 01:30 నిమిషాల సమయంలో, గట్టు మండల పరిధిలోని చమన్ ఖాన్ దొడ్డి స్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన కేసులో నిందితుడు సాయికుమార్‌కు గద్వాల్ ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. ఉదయ నాయక్ రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, తెలిపారు.
కేసు వివరాలు: గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రం నరేష్, మరికొంతమంది 20-06-2018న టాటా ఏసీ వాహనం (TS 33 TT 1126)లో మంత్రాలయానికి వెళ్లారు. 21-06-2018న తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు డ్రైవర్ సాయికుమార్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో చమన్ ఖాన్ దొడ్డి స్టేజ్ సమీపంలో వాహనం రోడ్డు నుండి దిగి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై గుర్రం నరేష్ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెం. 64/2018గా కేసు నమోదు చేయబడింది. గాయపడిన వారిలో పెద్ద బుచ్చన్న 23-06-2018న చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం సెక్షన్ మార్పు చేసి, పోస్ట్‌మార్టం నిర్వహించి, కేసు దర్యాప్తు పూర్తి చేయబడింది.
ఎస్ఐ టి.శ్రీనివాస్ ఈ కేసులో 31-10-2018న కోర్టుకు చార్షీట్ ఫైల్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల్ డిఎస్పి వై.మొగిలయ్య, గద్వాల్ సర్కిల్ ఆఫీసర్ టూరి శ్రీనుల పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. కోర్టులో సహాయక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచల్ సంజనా జాషువా వాదనలు సమర్థవంతంగా వినిపించగా కోర్టు కానిస్టేబుల్ వి.రాందాస్ సాక్షులను హాజరుపరచటలో కీలక సహకారం అందించారు.
విరూపక్షాల వాదనలు, సమర్పించిన సాక్షాదారాల ను సమగ్రంగా పరిశీలించిన అనంతరం నేరం స్పష్టంగా రుజువైనట్టు కోర్టు తేల్చి, నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తు అధికారులు సమర్ధవంతంగా విచారణ నిర్వహించి కోర్టులో బలమైన సాక్షాలు సమర్పించడం వల్లే ఈ కేసులో శిక్ష పడడం సాధ్యమైందని, జిల్లాలో కన్విక్షన్ రేట్ పెంచే దిశగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేసు దర్యాప్తు అధికారి అప్పటి ఎస్సై జి విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ హాజీ పాషా, ఎస్సై టి శ్రీనివాస్ ప్రస్తుత గట్టు ఎస్ శేఖర్ గౌడ్, సహాయక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచల్ సంజనా జాషువా, లైసెన్ ఆఫీసర్ ఎస్సై జిక్కి బాబు, పోర్ట్ కానిస్టేబుల్ వి రాందాస్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Tags: Strict Punishment for Speeding and Reckless Driving