మార్కాపురం ముచ్చట్లు:
క్రైమ్ నెంబర్:- 22/2026, U/s 105, 125(A), 125(B) BNS of Markapuram Rural PS.
నేరం జరిగిన తేది: ది 26.03.2026 వ తేది ఉదయం 05.40 గంటల సమయంలో మార్కాపురం మండలం, రాయవరం గ్రామం దాటిన తరువాత మెడికల్ కాలేజి దగ్గరలో NH-565 కొండ మూల మలుపు వద్ద.
పిర్యాది: చెంబేటి మేఘన తండ్రి మల్లిఖార్జున, వయస్సు 19 సం..రాలు, స్టూడెంట్, వింజమూర్ గ్రామం మరియు మండల, నెల్లూరు జిల్లా.
ముద్దాయిలు :1.పందెం యువరాజు తండ్రి జీవ రత్నం, వయస్సు 21 సం.రాలు, మార్కండపురం గ్రామము, పామూరు మండలం, మార్కాపురం జిల్లా. Driver of Hari Krishna Travels private bus bearing No. AR20 D 0487.
2.పాపన హరిబాబు @ హరి కృష్ణ S/o అంకిరెడ్డి, వయస్సు 43 సం..రాలు, కులం రెడ్డి, ఓనర్ అఫ్ హరికృష్ణ ట్రావెల్స్, నివాసం జర్రవారిపాలెం గ్రామము, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా. Owner of Hari Krishna Travels private bus bearing No. AR20 D 0487.
వివరాలు:- హరికృష్ణ ట్రావెల్స్ యజమాని సెకండ్ హ్యాండ్ బస్సులు కొనుగోలు చేసి, కలిగిరి నుండి జగిత్యాల, హైదరాబాద్ మరియు బెంగళూరులకు బస్సులను తిప్పుతూ వుండే వాడు. ఈ క్రమంలో సుమారు 8 నెలల క్రితం హైదరాబాద్ లో శ్రావణి ట్రావెల్స్ నడుపుతున్న యార్లగడ్డ కోటేశ్వర రావు అనే అతని వద్ద AR 20 D 0487 అనే బస్సు సెకండ్ హ్యాండ్ క్రింద కొనుగోలు చేసి, కలిగిరి నుండి జగిత్యాల మరియు నిర్మల్ తిప్పుతూ వుండేవాడు. మొదటి ముద్దాయి పందెం యువరాజు @ యువ మొదట గా హరికృష్ణ ట్రావెల్స్ బస్సు లకు క్లీనర్ గా సుమారు రెండు సవంత్సవరల నుండి పనిచేస్తూ, క్లీనర్ గా వెళ్ళేటప్పుడు బస్సు ను కూడా డ్రైవింగ్ చేస్తూ వుండేవాడు. ఈ క్రమంలో హరికృష్ణ ట్రావెల్స్ ఓనర్ అయిన రెండోవ ముద్దాయి హరిబాబు @ హరికృష్ణ, హెవీ డ్రైవర్ కు అయితే ఎక్కవ డబ్బులు ఇవ్వాలి అని, గత 8 నెలల నుండి AR 20 D 0487 బస్సు కు మొదటి ముద్దాయి కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయిన తక్కువ డబ్బులకు వస్తాడని సదరు బస్సు కు డ్రైవర్ గా పెట్టుకొన్నాడు.
తేది 25.03.2026 న AR 20 D 0487 నెంబర్ గల హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మొత్తం 44 మంది ప్రయాణికులతో (ఇద్దరు చిన్న పిల్లలుతో సహా) జగిత్యాల నుండి కలిగిరి కి లైసెన్స్ లేని మొదటి ముద్దాయి ఒక్కడే బస్సు కు డ్రైవర్ గా మరియు క్లీనర్ గా మహేంద్ర రెడ్డి వుండి బస్సు జగిత్యాల నుండి బయలుదేరి వస్తుండే క్రమంలో, మధ్యలో సుమారు మూడు సార్లు బస్సు సెన్సార్ ప్రాబ్లం వల్లన ఇంజిన్ ఆగి పోతుంది అని బస్సు డ్రైవర్ మొదటి ముద్దాయి యువరాజు, హరికృష్ణ ట్రావెల్స్ యజమాని అయిన రెండోవ ముద్దాయి హరిబాబు @ హరికృష్ణ కు చెప్పినట్లు, రెండోవ ముద్దయి సలహా మేరకు బస్సు రిపేర్ చేసుకుంటూ వస్తూన్నాడు. రెండోవ ముద్దాయి కి పదే పదే మొదటి ముద్దాయి బస్సు రిపేర్ వుంది అని చెప్పిన, వినకుండా ఇప్పటి ఇప్పుడు అర్ధరాత్రి వేరే బస్సు ఏర్పాటు చేయటం కుదరు, మెకానిక్ షాపు లు కూడా వుండవు, నీవు ఎలాగు రిపేర్ చేసుకుంటూ తీసుకోని, రిజర్వేషన్ రూట్ అనగా వినుకొండ వైపు రోడ్డు బాగా లేదు, యర్రగొండపాలెం వైపు తీసుకోనిరా నేను ఎదురు వస్తాను అని చెప్పగా, మొదటి ముద్దాయి బస్సు యర్రగొండపాలెం వైపు తీసుకోని వస్తుండగా, యర్రగొండపాలెం టోల్ ప్లాజా వద్ద మరల బస్సు రిపేర్ రాగా, మొదటి ముద్దాయి బస్సు రిపరి చేసుకుంటూ వుండగా, కొంతమంది ప్రయాణికులు బస్సు డ్రైవర్ ను అడుగగా, మా ఓనర్ చెప్పినాడు వస్తానని చెప్పినట్లు, హరికృష్ణ ట్రావెల్స్ యజమాని బస్సు కు ఎదురుగా వచ్చే క్రమంలో మార్కాపురం ఆగిపోయినట్లు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ మొదటి ముద్దాయి బస్సు కు మరల రిపేర్ వచ్చే లోపల కలిగిరి చేరాలి అనే ఉద్దేశ్యముతో బస్సు ను అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యం గా నడుపుతూ తేది 26.03.2026 సుమారు 5.40 గంటలకు, మార్కాపురం మండలంలోని, రాయవరం గ్రామం దాటిన తరువాత నిర్మాణంలో వున్నా మెడికల్ కాలేజి దగ్గరలో కొండా దిగే క్రమంలో వున్నా మూల మలుపు వద్దకు వచ్చే సరికి బస్సు పూర్తిగా కుడి వైపు వెళ్ళి, ఎదురుగా వస్తున్నా కంకర లోడు తో వస్తున్నా టిప్పర్ బేరింగ్ నెంబర్ : AP 39 UC 5265 యొక్క డీజిల్ ట్యాంక్ ను గ్రుద్దగా, టిప్పర్ రోడ్డుకు అడ్డగా పడి డీజిల్ ట్యాంక్ పగిలి, డీజిల్ మొత్తం బస్సు ఫై న మరియు టిప్పర్ ఒక్కసారిగా బస్సు ముందు బాగం నుండి మంటలు వ్యాపించి బస్సు మొత్తం మంటలో చిక్కుకొని కాలిపోతుండగా, కొంతమంది ప్రయాణికులు ఎగ్జిట్ మరియు డోర్ గ్లాస్ పగుల కొట్టి బస్సు నుండి క్రిందకు దూకి తప్పించుకొన్నారు. బస్సు మంటలో చిక్కొని 14 సజీవ దహనం అయి చనిపోయినారు. మిగిలిన 28 ప్రయాణికులకు గాయాలు అయినవి.
మొదటి ముద్దాయి మరియు రెండోవ ముద్దాయిలు ఇద్దరికి బస్సు కండిషన్ గురించి పూర్తిగా అవగాహన వుండి కూడా, ప్రయాణికుల భద్రత గాలికి వదిలేసి, ఏది అయిన ప్రమాదం జరిగితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉండటది అని కూడా తెలిసి, బస్సు ఎలాగు అయిన కలిగిరి తీసుకోని వెళ్ళాలనే ఉద్దశ్యంతో మొదటి ముద్దాయి వేగంగా నడిపి 14 మంది ప్రయాణికుల మరణనాకి మరియు 29 మంది గాయాలు అవుటకు కారణమైన ముద్దాయిల ఇద్దరిని ఈ రోజు రాబడిన సమాచారం మేరకు తేది 01.04.2026 న రాయవరం రైల్వే బ్రిడ్జి వద్ద మార్కాపురం డి.ఎస్.పి యు.నాగరాజు అరెస్ట్ చెయ్యడమైనది.
ఆక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్కాపురం DSP U.నాగరాజు సూచనల మేరకు మార్కాపురం సీఐ పి. సుబ్బారావు, SI’s మార్కాపురం టౌన్ మరియు రూరల్ మరియు వారి సిబ్బంది, మార్కాపురం ఫైర్ ఆఫీసర్ వారి సిబ్బంది, హైవే అథారిటీ అఫ్ ఇండియా వారి సిబ్బంది ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశం వద్ద వెళ్ళి బస్సు ప్రయాణికులను కాపాడిన అధికారులను మరియు సిబ్బందిని మార్కాపురం జిల్లా ఎస్పీ అభినందిచారు.
Tags; Markapuram District Police Arrest Accused in Bus Accident Case