పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు న్యాయవాదుల సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నూతనంగా ఎన్నికైన కార్యదర్శి అరవింద్‌కుమార్, ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన గురుమూర్తి , ట్రేజరర్‌గా ఎన్నికైన ఎలినార్ ప్రశాంతి పదవిబాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ నిర్మాణానికి భూమి, నిధులు ఇచ్చి భవనాన్ని నిర్మించి ఇచ్చిన మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్‌రెడ్డి, మాజీ ఎంపి రెడ్డెప్పలను సంఘానికి ఆహ్వానించి తగిన రీతిలో సత్కరించే కార్యక్రమం త్వరలోనే నిర్వహిస్తామన్నారు. అలాగే న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Tags; We will resolve the lawyers’ issues.