పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉధ్యమిస్తామని ఆర్టీసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసి డిపోలో ఎంప్లాయ్సి యూనియన్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. డిపోలో ఉన్న సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న సమస్యలు గురించి రాష్ట్ర కమిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. స్పందించకపోతే ఉధ్యమాలు చేపడుతామన్నారు.
15 ఒంగోలులో వజ్రోత్సవాలు …
రాష్ట్ర వజ్రోత్సవ మహా సభలను ఈనెల 15న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని ఆర్టీసి ఉద్యోగులందరు ఈ మహాసభల్లో పాల్గొని పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సభల్లో ప్రత్యేక తీర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Tags: We will strive to resolve the issues faced by RTC employees.