April 1, 2026
Explore
మధ్యాహ్న భోజనంలో బల్లి

మధ్యాహ్న భోజనంలో బల్లి

April 1, 2026 | Andhra Pradesh

5 మంది చిన్నారులకు అస్వస్థత

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపల్‌ యూపిస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 5 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నగరివీధిలో గల యూపిస్కూల్‌లో 124 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బుధవారం మధ్యాహ్నం హెచ్‌ఎం నూర్జహాన్‌ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. 5వ తరగతికి చెందిన స్నేహ అనే విద్యార్థిని భోజనం తినే సమయంలో బల్లి రావడంతో ఆమె ఉపాధ్యాయులకు తెలిపింది. ఇలా ఉండగా ఆ సమయంలో 4వ తరగతికి చెందిన రమ్య ,5వ తరగతికి చెందిన వర్షిత తో పాటు మరి కొంత మంది ఆహారం తినడంతో వారికి కడుపునొప్పి రావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం తెలిసింది. తల్లిదండ్రులు వచ్చి పిల్లలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. ప్రస్తుతం ఎవరికి ప్రాణపాయం లేదని డాక్టర్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్ధార్‌ రాము , ఎంఈవో నటరాజారెడ్డి పాఠశాలను సందర్శించి, విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో బాధిత విద్యార్థులను పరామర్శించారు. పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. నిర్లక్షం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. ఈ సంఘటనతో పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో ఆప్రాంతం భయాందోళనలతో నిండిపోయింది.

Tags: Lizard at lunch