April 1, 2026
Explore
అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు

April 1, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

పరిపాలనలో ఎలాంటి లోపాలు.. అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నతస్థాయి ఉద్యోగులు మొదలుకుని… క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని చెప్పారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రొత్సహిస్తామని… పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని.. అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్బంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు.

Tags; From now on, I will directly report the performance of officials to the public: AP CM Chandrababu