గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సి.యం.సాయికాంత్ వర్మ.
కలెక్టర్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ.. కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు.
జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడి.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని స్పష్టీకరణ.
‘స్వర్ణాంధ్ర విజన్ @2047’ లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టిసారిస్తామని.. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ.
సాయికాంత్ వర్మకు గతంలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు CEOగా, GVMC కమిషనర్‌గా పనిచేసిన అనుభవం.
Tags; Saikanth Varma appointed as the new Collector of Guntur District.