అమరావతిముచ్చట్లు:
నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు “మన చరిత్ర మనం రాసుకునేంతవరకు ఎవరో రాసిన తప్పుడు చరిత్రనే నిజమని నమ్మాల్సి వస్తుంది”.
ఏప్రిల్ నెలను ఒక పవిత్ర మాసంగా భావించాలి కారణం ఈ నెలలో ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్న మహనీయులలో ఒకరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 14, అంబేద్కర్ స్వయానా గురువుగా ప్రకటించుకున్న స్త్రీ జనోద్ధారణ కార్యసాధక ఆద్యుడు మహాత్మా జ్యోతిబాపూలే జయంతి కూడా ఈ నెల 11 కావడం మరో ప్రత్యేకం. దేశంలో బహుజనుల పాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా అక్షరం వైపు చూడడానికి ప్రధాన కారణం మహాత్మ జ్యోతిబాపూలే మరియు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గార్లు. సత్యశోధక సమాజ్ కు స్థాపించి సత్యాన్ని సోదించాలని చెబుతూ మూఢనమ్మకాల నిర్మూలన తోపాటు స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ కోసం వారు చేసిన సేవ దేశం యొక్క స్థితిగతులను మార్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశ స్థితిగతులను మార్చగలిగే ఒక వ్యక్తిని అందించిన "మాత రమాబాయి, అంబేద్కర్ గార్లకు వివాహం జరిగినది ఏప్రిల్ 4. తన బిడ్డలకు కనీస వసతులు కల్పించుకోలేని పరిస్థితిలో ఉండి చనిపోతుంటే ఈ దేశ బిడ్డలే తన కన్న బిడ్డలనే నమ్మిన దంపతులు ఈ దేశానికి ఆదర్శ దంపతులు.
భారతదేశ ఉప ప్రధానిగా ఎన్నో చట్టాల ద్వారా అనగారిన వర్గాల వారి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5, శతాబ్దాల క్రితమే భారతదేశ జీవన మార్గమైనది “గౌతమ బుద్ధుని బౌద్ధ ధర్మం”. ఆ ధర్మాన్ని కాపాడడంలో సాటిలేని కృషిచేసిన రారాజు సామ్రాట్ అశోకుడి జయంతి ఏప్రిల్ 7, దేశంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని అంబేద్కర్ “హిందూ కోడ్ బిల్లు” సమర్పించిన తేదీ 11, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ఓటు హక్కును పొంది, అనుబంధంగా రిజర్వ్ స్థానాల కోసం పోరాటంలో భాగంగా ఎర్రవాడ జైలులో నాలుగోసారి గాంధీతో చర్చల్లో పాల్గొన్నది ఏప్రిల్ 23, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా “రాజ్యాధికారమే మాస్టర్ కీ”అని ప్రయోగాత్మకంగా చూయిస్తూ అంబేద్కర్ పార్లమెంటు ఎన్నికైన తేదీ 24….. ఇలా దేశాన్ని చైతన్య పథంలో నడిపించడానికి కీలకమైన ఎన్నో సంఘటనలు జరిగిన, చరిత్ర కలిగిన మాసం ఏప్రిల్. ఏప్రిల్ అందరికీ పవిత్ర మాసమే…
Tags: Not April Fools’ Day… but the Month of Great Souls.