November 29, 2026
Explore
నల్లగంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.2.66 లక్షలు

నల్లగంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.2.66 లక్షలు

November 29, 2026 | Andhra Pradesh

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె నల్లగంగమ్మ ఆలయంలో శనివారం ఎండోమెంట్ అధికారి శివయ్య ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 2026 జూన్ 11 నుంచి నవంబర్ 28 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.2,66,430 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

ఈ నగదును ఆలయ ఖాతాలో జమ చేసినట్లు ఆలయ ఈవో దేవదాసు పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో టెంకాయల విక్రయంతో పాటు వివిధ దుకాణాలకు వేలం నిర్వహించగా రూ.4,62,500 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పవనకుమార్, దినేష్, దిలీప్, ప్రశాంత్, భాస్కర్ పాల్గొన్నారు.

Tags: Nallagangamma Temple Hundi (offering box) collection amounts to Rs 2.66 lakh