November 29, 2026
Explore
ఖాకీ దుస్తుల్లోనూ కరుణామూర్తులు!

ఖాకీ దుస్తుల్లోనూ కరుణామూర్తులు!

November 29, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:


దివ్యాంగుడిని చేతులపై మోసుకెళ్లి ఓటు వేయించిన పోలీసులు

అన్నమయ్య జిల్లా ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రాయచోటికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శంకర్ రాజు, కానిస్టేబుల్ జగన్ ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడికి అండగా నిలిచారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న అతడిని ఇద్దరూ చేతులపై ఎత్తుకొని తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు. ఒకవైపు ఎన్నికల విధులు నిర్వహిస్తూనే మరోవైపు దివ్యాంగుడికి సహాయం చేయడంపై పలువురు అభినందనలు తెలిపారు. తొలి విడత ఎన్నికల్లోనూ దేవపట్ల రెడ్డివారిపల్లెలో వృద్ధ మహిళను ఏఎస్ఐ గంగరాజు చేతులపై ఎత్తుకొని ఓటు వేయించిన విషయం తెలిసిందే. ఖాకీ దుస్తుల వెనుక మానవత్వం కూడా ఉందని పోలీసులు మరోసారి చాటుకున్నారు.

tags: Compassionate souls, even in khaki uniforms!