అన్నమయ్య ముచ్చట్లు:
గోమాతల సంరక్షణ, సేవ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సొంత వ్యవసాయ క్షేత్రంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిన్నమండెం–సంబేపల్లి మండలాల సరిహద్దులోని నారాయణరెడ్డిగారిపల్లె, కొత్తపల్లె గ్రామాల పరిధిలో ఉన్న తన భూమిలో గోశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోమాతల సంరక్షణకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సొంత భూమిని కేటాయించడం విశేషం. ప్రజా జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ గోశాల నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ గోశాల గోమాతల సంరక్షణకు ఉపయోగపడాలని మంత్రి ఆకాంక్షించారు.
Tags; Initiating a ‘Goshala’ (cow shelter) on own land: Minister