November 29, 2026
Explore
గంగమ్మ గుడిని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వీఎన్‌సీ బాలు నాయక్

గంగమ్మ గుడిని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వీఎన్‌సీ బాలు నాయక్

November 29, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం సంబేపల్లిలోని శ్రీ దేవరాయ నల్ల గంగమ్మ ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వీఎన్‌సీ బాలు నాయక్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ఆలయ విశేషాలను అక్కడ ఉన్న ఆలయ పూజారినడిగి తెలుసుకున్నారు.

సాస్కి నిధులతో సీకే రోడ్డు నుంచి పాలెం మీదుగా శెట్టిపల్లెకు చేపట్టిన తారు రోడ్డును దేవరాయ క్రాస్ నుంచి గుడి సమీపం వరకు 3.75 మీటర్ల నుంచి 5.7 మీటర్లకు విస్తరించాలని అక్కడ ఉన్న భక్తులు వీఎన్‌సీ బాలు నాయక్‌ను కోరారు.

ఈ సందర్భంగా ఆయన రోడ్డును పరిశీలించి, భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని లైన్ ఎస్టిమేట్‌ను మార్పించి రోడ్డు వెడల్పునకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Tags: State Panchayat Raj Engineer-in-Chief VNC Balu Naik visited the Gangamma temple.