November 29, 2026
Explore
నంబూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ

నంబూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ

November 29, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా , గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, , జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తో కలిసి పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నంబూరు గ్రామ జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తును పరిశీలించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చేపట్టిన చర్యలను సమీక్షించారు.

ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ పర్యటనలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: State Election Commissioner, District Collector, and SP inspect the Namburu polling station