November 29, 2026
Explore
శావల్యాపురం ఎస్ఐ పై విచారణ కు ఆదేశించిన జిల్లా ఎస్పీ జగదీష్.

శావల్యాపురం ఎస్ఐ పై విచారణ కు ఆదేశించిన జిల్లా ఎస్పీ జగదీష్.

November 29, 2026 | Andhra Pradesh

వినుకొండ ముచ్చట్లు:

ఎస్సీ కాలనీలోకి ప్రవేశించి విచక్షణారహితంగా ఎస్ఐ దాడిచేసి కొట్టారని ఎస్పీ కి ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు,

బూట్ కాలుతో, లాఠీలతో నిర్దాక్షిణ్యంగా చావబాదారని ఎస్పీ కి విడియోలు చూపించిన బాదితులు.

శావల్యాపురం ఎస్ఐ మోర్లా వెంకటేష్ బాబు పై పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి కి ఎస్సీ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

శావల్యాపురం లో ఎన్నికల రోజు ఎస్సీ కాలనీలో లో ఉన్న తమపై ఎస్ఐ వెంకటేష్ బాబు తన సిబ్బందితో వచ్చి విచక్షణారహితంగా కొట్టారని, అసభ్యకరంగా మాట్లాడుతూ, కులం పేరుతో దూషించాడని, ఈ సంఘటనలను విడియో లు తీస్తున్న యువకుల పై కూడా దాడి చేసి వారిని గాయపరిచి, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ లను తీసుకువెళ్లారని.

ఇళ్ల లోకి లాఠీలతో ప్రవేశించారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిని బూటు కాలుతో తన్నారని వాటికి సంబంధించిన విడియోలను ఎస్పీ కి చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ కాలనీ వాసులు ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ జగదీష్ ఎస్ఐ పై విచారణ కు ఆదేశించినట్లు బాదితులు తెలిపారు.

Tags; District SP Jagadish has ordered an inquiry into the Savalyapuram SI.