November 29, 2026
Explore
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించిన కలెక్టర్

వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించిన కలెక్టర్

November 29, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

పీలేరు డివిజన్‌లో జరుగుతున్న రెండో విడత పంచాయతీ పోలింగ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలెక్టరేట్‌లోని ప్రధాన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూలైన్లు, సౌకర్యాలు, నిర్వహణ తీరును నోడల్ అధికారులు రమేష్ రెడ్డి, లక్ష్మీదేవితో సమీక్షించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కళ్యాణి, డీపీఓ రాధమ్మ పాల్గొన్నారు.

Tags; Collector monitored polling via webcasting