November 29, 2026
Explore
మల్లయ్యకొండకు రేపు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

మల్లయ్యకొండకు రేపు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

November 29, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లి ముచ్చట్లు:


తంబళ్లపల్లికి సోమవారం మల్లయ్యకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం వెంకటరమణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లి, తంబళ్లపల్లి రాగిమాను సర్కిల్ నుండి, తంబళ్లపల్లె నుండి మొత్తం 4 బస్సులను మల్లయ్యకొండకు నడుపుతామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బస్సు సమయాలకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని డీఎం కోరారు.

Tags: Special RTC buses to Mallayya Konda tomorrow