గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి ఆదేశాల మేరకు ది.12122026 (రెండవ శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ, పిడుగురాళ్ళ వారి ఆధ్వర్యంలో స్థానిక సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ కమ్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) టి ప్రవ ల్లిక తెలియజేసారు.
కావున పిడుగురాళ్ళ కోర్టు పరిధిలోని కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులు (ముందస్తు వ్యాజ్యము లు) తదితర కేసులు రాజీమార్గం ద్వారా పరి ష్కరించుకోవచ్చనని తెలియజేశారు.
తద్వారా కక్షిదారులకు సమయము మరియు ధనము ఆదా అవుతుందని అని తెలియజేశారు. 12 122026 (రెండవ శనివారం) న పిడుగురాళ్ళ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు ప్రాంగ ణంలో జాతీయ లోక్ అదాలత్ జరుగును.
కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగ పరచుకోవాల్సిందిగా కోరడమైనది.అని అన్నారు.
Tags; National Lok Adalat on December 12 – Judge T. Pravalika