హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కార్తీక దీపం అంటుకుని 18 ఏళ్ల యువతి సాయి వెంకట సింధు ప్రాణాలు కోల్పోయింది.
అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సింధు.. రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీ రాత్రి షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ఆమె చీరకు అంటుకుంది.
దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి సింధు తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ శుక్రవారం సింధు మృతి చెందింది.
18 ఏళ్ల యువతి అకాల మరణంతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags: Young woman dies after catching fire from a ‘Karthika Deepam’ (lamp); tragedy in Kukatpally!